Wednesday, 4 November 2026

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ సమస్య పరిష్కరించాలి – ఎంపీపీ అధ్యక్షతన అభివృద్ధి కమిటీ సమావేశం

జనం సాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీ.హెచ్.సీ) లో శుక్రవారం ఎంపీపీ అరెళ్లి. దేవక్క కొమురయ్య అధ్యక్షతన అభివృద్ధి కమిటీ, జన ఆరోగ్య సమితి (జేఏసీ) కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ రూ. 4.25 లక్షల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని డీప్యూటీ డీఎం అండ్ హేచ్ఓ డా. రామ్ సింగ్, డీడీఓ డాక్టర్.సంపత్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఐ.ప్రదీప్ కుమార్ తెలిపారు. విద్యుత్ సమస్యతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సీసీ కెమెరాలు, కంప్యూటర్, టీవీ, ఫ్రిడ్జ్,ఇతర సామాగ్రి కాలిపోతున్నాయని దీనితో రోగులకు, ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సర్పంచ్ లు బుర్ర పద్మ శంకర్ (బేగంపేట్), పల్లె ప్రతిమా పీవీరావు లు (రత్నాపూర్) ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ బిల్లు ఆపాలని, 108 అంబులెన్స్ స్థానికంగా ఉండేలా చూడాలని, పీహెచ్సీ సమయం పెంచాలని తీర్మానం చేశారు. సోమవారం మరో మారు సమావేశం ఏర్పాటు చేసి, విద్యుత్, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్ తో సమావేశం ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. ఈ సమావేశంలో స్టాఫ్ నర్స్ రాజమణి, మల్లేష్, సి హెచ్ ఓ బి.భరత్, హెచ్ఈఓ సీతారామయ్య చౌదరి, ఏఎన్ఎం రాజేశ్వరి, మణెమ్మ, శ్రీనివాస్, రాజగోపాల్ పాల్గొన్నారు.