రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు
– ఇరిగేషన్ చరిత్రలోనే హరీష్రావులాంటి మంత్రి మరొకరు లేరు
– సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నారు
– ఈనెల 12న సిద్ధిపేటలో పశువులు, గొర్రెలు అందజేత కార్యక్రమం ప్రారంభం
– బీసీలను ఇన్నాళ్లు ప్రభుత్వాలు ఓటుబ్యాంకుగా వాడుకున్నాయి
– టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే బీసీల అభివృద్ధికి కృషి చేస్తుంది
– విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
హైదరాబాద్, సెప్టెంబర్4(జనం సాక్షి) : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వేగంగా చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, దీనిలో భాగంగా మంత్రి హరీష్‌రావు ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో తలసాని మాట్లాడారు. రైతులు ఆకాశంవైపు చూడొద్దన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని, సీఎం కేసీఆర్ మునుపెన్నడూ లేనివిధంగా సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నారని మంత్రి తెలిపారు. ఇరిగేషన్ కు సంబంధించి ఇన్నేళ్ల రాష్ట్ర చరిత్రలో హరీశ్ రావు లాంటి మంత్రి మరొకరు లేరని.. రాత్రింబవళ్లు ప్రాజెక్టుల పూర్తికి శ్రమిస్తున్నారన్నారని స్పష్టం చేశారు. ఈ నెల 12న పెద్ద ఎత్తున పశువులు, గొర్రెలు ఇచ్చే కార్యక్రమం సిద్దిపేట జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో చేయని అభివృద్ధి కార్యక్రమాలను టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదని తలసాని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబందు లాంటి కార్యక్రమాలు ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సాధ్యమైందని తలసాని వివరించారు. 70 ఏండ్లలో ఎవరూ ఇలాంటి కార్యక్రమాలు తీసుకోలేదని..కులవృత్తులపై ఆధారపడ్డ వాళ్ళను అన్ని విధాలా ఆదుకుంటున్నామని తలసాని అన్నారు. బీసీలను ఇన్నాళ్లు అన్ని ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూశాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే బీసీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ప్రగతి నివేదిక లాంటి సభ ఇంత వరకు రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే లేదన్నారు. జీవో 6కు సంబంధించి ఏమైనా ఇబ్బందులుంటే సవరించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి తలసాని అన్నారు.
ప్రాజెక్టుల పూర్తికి..




