Tuesday, 3 November 2026

ప్రారంభమైన వ్యక్తిత్వ వికాస తరగతులు

 

 

 

 

 

 

జహీరాబాద్ ఫిబ్రవరి 6 (జనం సాక్షి). జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్ లో గల ఆర్ ఎల్ కన్వెన్షన్ లో రెండు రోజుల ఇంపాక్ట్ వ్యక్తిత్వ వికాస తరగతులు ప్రారంభించారు. జహీరాబాద్ లోని వివిధ కళాశాలలో ని విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రజా పత్రినిధులు హాజరయ్యారు.తరగతులు రెండు రోజుల పాటు కొనసాగుతాయి,అని నిర్వాహకులు తెలిపారు. ఆచార్య డిగ్రీ కళాశాల విద్యార్థిని ఆయేషా గోల్డ్ మెడల్ సాధించారు. అధ్యాపకులు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇచ్చినందున విద్యార్థిని ఆయేషాను గోల్డ్ మెడల్ తో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆచార్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హరికుమార్ మాట్లాడుతూ తాము తమ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు అన్ని విధాల పోటీ పరీక్షల్లో రాణించే విధంగా తయారుచేస్తున్నందువల్లనే తమ విద్యార్థిని ఈ అవార్డు సాధించగలిగిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినికి శుభాకాంక్షలు తెలియజేశారు కళాశాల బృందం. ఇంపాక్ట్ నిర్వాహకులు. తదితరులు పాల్గొన్నారు