Wednesday, 4 November 2026

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట :

 

 

 

 

 

 

 

 

 

 

– బీఆర్ఎస్ నాయకులు ఖిజర్ యఫైజహీరాబాద్ ఫిబ్రవరి 6 (జనం సాక్షి). తిరుగులేని పాలనతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సాధించుకున్న బి ఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం వందల సంఖ్యలో సంక్షేమ పథకాలను అమలుచేస్తుందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఖిజర్ యఫై తెలిపారు, సోమవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నాలుగవసారి వార్షిక బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే, బడ్జెట్ పై బిఆర్ఎస్ నాయకులు ఖిజర్ యఫై మాట్లాడుతూ దేశ చరిత్రలో సంక్షేమ పథకాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్ప మరే రాష్ట్రాలు ఇంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించడం లేదని, గంగా జమున తహెజీబ్ కు ప్రతిరూపం కల్పిస్తూ నిన్న 2 లక్షల 90 వేల 385 కోట్ల రూపాయలను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీష్ రావు ముస్లిం మైనార్టీలకు 2200 కోట్లు, ఎస్సీ సంక్షేమం కోసం 15 వెయ్యిల కోట్లు, ఎస్టీల సంక్షేమం కోసం 3 వెయ్యిల కోట్లు, బీసీల సంక్షేమం కోసం 6 వెయ్యిల కోట్లు, రైతుల సంక్షేమం కోసం 26 వెయ్యిల కోట్లకు పైగా కేటాయించి, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ కోసం దాదాపు 2 వెయ్యిల కోట్లకు పైగా నిధులు కేటాయించడం హర్షించదగ్గ పరిణామం అని, ప్రజా సంక్షేమానికి పెద్దపిట వేస్తూ కులమతాలకు అతీతంగా వందల సంఖ్యలో సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు అమలు చేస్తున్నారని బి ఆర్ ఎస్ నాయకులు ఖిజర్ యఫై హర్షం వ్యక్తం చేశారు.