ప్రార్థన సమయానికి ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కాకుంటే చర్యలు
ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ప్రార్థన సమయానికి ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కాకుంటే చర్యలు తీసుకుంటామని ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ అన్నారు.
శనివారం మండలంలోని కేతేపల్లి భగత్ సింగ్ నగర్ ప్రాథమిక పాఠశాలను ప్రార్థన సమయానికి సందర్శించి, ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని పరిశీలించారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా విద్యా సామర్ధ్యాలను పరిశీలించి,అనంతరం తొలిమెట్టు కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ప్రాథమిక అంశాలపై పట్టు వస్తుందని, సామర్థ్యాల వారీగా,మెరుగైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను సూచించారు. ప్రతి విద్యార్థికి గణిత చతుర్విధ ప్రక్రియలను నేర్పించాలని, అదేవిధంగా విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా పెంచాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కోరారు.