హైదరాబాద్,జనవరి28(జనంసాక్షి): కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కి చేయూతనిచ్చేందుకే ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చారని ఆ పార్టీ నేత వీహెచ్ చెప్పారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి నెగిటివ్ మనిషి అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచించారు. ప్రియాంక రాకతో బీజేపీ నేతలు కలవరపడుతున్నారన్నారు. లేకుంటే ఇంతగా కలత చెందరని అన్నారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదన్నారు.




