Thursday, 5 November 2026

సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపం తెలిపిన దేవరయాంజల్ నాయకులు:శామీర్ పేట్,

సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపం తెలిపిన దేవరయాంజల్ నాయకులు:శామీర్ పేట్, జనం సాక్షి :తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవర

యాంజాల్ లో భగత్ సింగ్ విగ్రహం వద్ద తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు పెండం లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు సూపర్ స్టార్,మాజీ ఎంపీ కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు .
కాంగ్రెస్ మాజీ ఎంపీ,ప్రముఖ కధానాయకుడు,తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కలర్ సినిమాను పరిచయం చేసిన నటుడు,తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ధ్రువతారగా వెలుగొంది రికార్డు స్థాయిలో 340పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు సాధించిన (సూపర్ స్టార్ కృష్ణ) గౌ॥ఘట్టమనేని శివరామకృష్ణ మృతి బాధాకరం,దురదృష్టకరం.వారి పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము.వారి కుటుంబ సభ్యులకు ఘట్టమనేని/సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు .సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు.మద్రాసు నుంచి హైదరాబాదుకు చలనచిత్ర పరిశ్రమ తరలివచ్చిన క్రమంలో హైదరాబాదులో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సూపర్ స్టార్ కృష్ణ ఎంతో కృషి చేశారు.
ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి,మున్సిపాలిటీ బిజెపి పార్టీ అధ్యక్షులు నర్సింహారెడ్డి,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మురళి గౌడ్, రాము,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు ధర్మారెడ్డి, రామాలయం మాజీ ధర్మకర్త నర్సింహారెడ్డి,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ కార్యదర్శి పాండు గౌడ్,సీనియర్ నాయకులు శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి,నర్సింగ్ రావు,ఎల్లయ్య గౌడ్,యన్ యస్ యు ఐ నాయకులు మనితేజ,బన్ని తదితరులు పాల్గొన్నారు.
15 ఎస్పీటీ -3: నివాళులు అర్పిస్తున్న నాయకులు