Tuesday, 3 November 2026

సావిత్రి బాయ్ పూలే జాతీయ అవార్డు పొందిన నందనం కవిత

సావిత్రి బాయ్ పూలే జాతీయ అవార్డు పొందిన నందనం కవిత
-దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ గా ఉత్తమ సేవలకు గుర్తింపు

మహబూబాబాద్ బ్యూరో-జనవరి3(జనంసాక్షి)

మహబూబాబాద్ జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ ఉత్తమ సేవలందిస్తున్న నందనం కవితను గుర్తించి సావిత్రి బాయ్ పూలే జయంది సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సావిత్రి బాయ్ పూలే జాతీయ అవార్డును బీసీ సంక్షేమ శాఖ,బీసీ మహిళా సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన సంకృతి, కళా రంగాల ప్రోత్సాహకాలకార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి వర్యులు వి శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ కులబారణం కృష్ణమోహన్, బీసీ సంక్షేమశాఖ జాతీయ అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ చేతులమీదుగా నందనం కవితకు అందించారు. తన సేవలను గుర్తించి తనకు అవార్డు దొరకడం చాలా సంతోషాన్ని అందించిందని కవిత అన్నారు. ఇలాంటి ప్రోత్సహాలతో మరింత హుషారుగా సేవాలందిస్తానని తన బాధ్యతను మరింత చురుకుగా నిర్వహిస్తానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమశాఖ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు రోజా రమణి, రాష్ట్ర కార్యదర్శి బుర్ర వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు భైరి రవికృష్ణ, వదలకుండ వేణుగోపాల్ గౌడ్, మాదం పద్మజ దేవి తదితరులు పాల్గొన్నారు