ప్రేమ పేరుతో నయవంచన
యవుతి నగ్న ఫోటోలను పంపడంతో ఆత్మహత్య
శ్రీకాకుళం,నవంబర్6 (జనంసాక్షి): రేగిడి ఆముదాలవలస మండలం, కొత్తచెలికానివలసలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో దళిత యువతిని హరీష్ అనే యువకుడు మోసం చేశాడు. యువతి నగ్న ఫొటోలను ఆమె సోదరుడికి పంపాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు హరీష్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హరీష్‌ను కఠినంగా శిక్షించాలంటూ దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి.