ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనీలో పర్యావరణ ప్రేమికుడు గుండేటి యోగేశ్వర్ పలువురు పర్యావరణ ప్రేమికులతో కలిసి అవగాహన కార్యక్రనిర్వహించారు.బట్ట,కాగితం, ఉన్ని, జనపనార సంచులు మరియు స్టీల్ పాత్రలు ప్రదర్శించారు, ప్లాస్టిక్ భూతం బొమ్మను వీదుల్లో తిప్పుతూ ప్లాస్టిక్ భూతాన్ని తరిమేసి పర్యావరణ కాపాడాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా యోగేశ్వర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఐక్య రాజ్య సమితి “బీట్ ప్లాస్టిక్” ప్లాస్టిక్ నిషేధిద్దాం అనే సందేశంతో ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కలిగిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సమాజాన్ని చైతన్యం చేసేందుకు అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు.
జీవజాతుల మనుగడకు తీవ్ర విఘాత కలిగిస్తున్న సింగిల్ యూస్ ప్లాస్టిక్ వలన కలిగే పలు నష్టాల గురించి తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను మూగజీవాలు తిని మృత్యువాతన పడుతున్నాయని, కాల్చి వెలువడే విష వాయువులతో ఓజోన్ పొర కు నష్టం కలిగి తద్వారా అనేక క్యాన్సర్ వ్యాధులు కారణం అవుతుందన్నారు. నేలలో పడేస్తే భూగర్భ జలాలకు అడ్డుపడుతుంది రోడ్లపై వేస్తే నాళ్ళల్లో చిక్కుకొని దోమలద్వారా విష జ్వరాలు వస్తాయని పేర్కొన్నారు.
ప్లాస్టిక్ వినియోగం, వివిధ కర్మకారాలు , అధిక శిలాజి ఇంజనం వినియోగం వలన అధిక స్థాయిలో కార్బన్ ఉధ్గారాలు, గ్రీన్ హౌస్ వాయువుల ఏర్పడి భూతాపం ఇప్పటికే సుమారు.1.5 అధిక డిగ్రీల వరకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులో ఈ భూగోళంపై ప్రాణకోటి మనుగడ కష్టతరమవుతుందన్నారు.
అందుకే ప్లాస్టిక్ సంచులు మానేసిబజార్ కి వెళ్లే ప్రతిసారి బట్టచితోనే వెళ్లాలని మనతోపాటు ఇరుగుపొరుగు వారిలో చైతన్య కలిగించాలని, పుట్టినరోజుతో పాటు వివిధ సందర్భాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని మొక్కలను కానుకలుగా ఇవ్వాలని,ప్రతి పౌరుడు పర్యావరణ మిత్రులుగా మారాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మడుపు రాంప్రకాష్ ,.పర్యావరణ ప్రేమికులు, వెన్నంపల్లి రవీందర్, దుర్గం రాజేశం గౌడ్, గజెల్లి వెంకటయ్య , కట్ల భాగ్యలక్ష్మి, , వేముల సత్యనారాయణ, సుశీల, రాజేశ్వరి, కాలనీ వాసులు పాల్గొన్నారు.




