ఫిట్స్ వ్యాధిగ్రస్తులైన చిన్నారి శ్రుతి కి ఆర్థిక సహాయం
గద్వాల నడిగడ్డ, నవంబర్ 19 (జనం సాక్షి);
ఫిట్స్ తో బాధపడుతున్న చిన్నారి శ్రుతి (7) కి
జోగులాంబ గద్వాల జిల్లా సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం శనివారం ఆ చిన్నారికి 16 వేల రూపాయలను అందజేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామానికి చెందిన నాగరాజు కూతురు చిన్నారి కి ఫిట్స్ తో బాధపడుతున్న అమ్మాయికి నెలకు 1600 రూపాయల ఖర్చవుతుందని, వరుసగా మూడు సంవత్సరములు మందులు వాడాలని డాక్టర్లు సూచించినట్లు, తాను చిన్న కటింగ్ షాప్ నడుపుతున్నారని ఆమెకు మందులు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నానని చిన్నారి తండ్రి నాగరాజు గద్వాల సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం సభ్యులను సంప్రదించగా వారు స్పందించి తమకు సహాయం చేశారని, ఈ సందర్భంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సురేందర్ బాబు వెంకటేష్ పాండు సంధ్య అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఫిట్స్ వ్యాధిగ్రస్తులైన చిన్నారి శ్రుతి కి ఆర్థిక సహాయం




