మున్నూరు కాపు కార్తీక వనభోజనాలకు తరలిరండి
వరంగల్ ఈస్ట్, నవంబర్ 19(జనం సాక్షి)
ఈనెల 20 ఆదివారం 10 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించే మున్నూరు కాపు కార్తీక వనభోజనాలను విజయవంతం చేసేందుకు మున్నూరు కాపులంతా తరలిరావాలని కోరారు. ఈ మేరకు శనివారం సాయంత్రం రంగ్సాయిపేట మహంకాళి గుడి ఆవరణ నుండి స్థానిక మునురుకాపు కుల బాంధవులు బైక్ ర్యాలీతోపాటు ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం లో మొదటిసారిగా మున్నూరుకాపులు నిర్వహిస్తున్న ఈ కార్తీక వనభోజనాలను విజయవంతం చేసి మున్నూరు కాపుల ఐక్యతను చాటాలని పలువురు మున్నూరు కాపు పెద్దలు కోరారు. దూపకుంట రోడ్ లోని మై మాస్టర్ స్కూల్ పక్కన ఉన్న మామిడి తోటలో ఈ వనభోజన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయిని అశోకు, శంకేసి కుమారస్వామి శంకేసి శ్రీనివాసమూర్తి బజ్జూరు వీరేశం ప్రభాకర్ చిట్ల శ్రీనివాస్ ఇటికాల అశోక్, కర్ర కుమార్, పోతు రమేష్ ,శంఖేష్ కమలాకర్, ఆకుల వెంకటేశ్వర్లు రంజిత్ సతీష్ కడల అశ్విన్ శంకేష్ వేణు, ఇమ్మడిశెట్టి రవీందర్, కిరణ్, పుట్ట రవి , దడిగల రవి ,శంకేసి సత్యం ,జక్కం దామోదర్, లక్కాకుల సతీష్, బజ్జూరి నెల రాజు ,శంకేసి కిషోర్, గాదె సాంబమూర్తి పాల రంజిత్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.




