
ప్రత్యేక పరిస్థితుల్లోనే ఆర్డినెన్సులు
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
దిల్లీ,జనవరి21(జనంసాక్షి): పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 28న సాధారణ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. నిజానికి ఆ రోజు (శనివారం) సెలవు దినమైనప్పటికీ.. ప్రత్యేక సమావేశంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇక ఆర్థిక గణనను 27న, రైల్వే బడ్జెట్‌ను 26న సమర్పిస్తారు. ఇటీవల జారీచేసిన ఆరు అత్యవసర ఆదేశాల(ఆర్డినెన్స్)పై ఈ సమావేశాల్లోనే చట్టాలను తీసుకురావాలనీ కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన పార్లమెంటు వ్యవహారాల కేంద్ర మంత్రిమండలి సంఘం (సీసీపీఏ) బడ్జెట్ సమావేశాల జాబితాను రాష్ట్రపతికి సిఫారసు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రులు రాజీవ్ ప్రతాప్ రూడీ, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ.. న్యాయమంత్రి సదానంద ్ణొడ, రసాయనాల మంత్రి అనంతకుమార్, పర్యావరణ, అటవీమంత్రి ప్రకాశ్ జవదేకర్, తదితరులు సీసీపీఏ బ’ాటీకి హాజరయ్యారు. సాధారణంగా ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్‌ను సమర్పించటం సంప్రదాయంగా వస్తోంది. ఒకవేళ ఆ రోజు శనివారమైతే గతంలోనూ బడ్జెట్‌ను సమర్పించిన దాఖలాలు ఉన్నాయని ఒక సీనియర్ మంత్రి పేర్కొన్నారు. ఉభయసభల సంయుక్త బ’ాటీలో రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభవుతాయి. అనంతరం రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ, ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీనిపై ఫిబ్రవరి 24, 25న చర్చ జరుగుతుంది. మొత్తం 66 రోజుల పాటు జరిగే ఈ బడ్జెట్ సమావేశాలు రెండు ధఫాలుగా సాగనున్నాయి. ఫిబ్రవరి 23న మొదలయ్యే తొలి దఫా సమావేశాలు మార్చి 20 వరకు సాగుతాయి. నెల రోజుల విరామం అనంతరం రెండో దఫా సమావేశాలు ఏప్రిల్ 20న ఆరంభమై మే 8న ముగుస్తాయి. సమావేశాల విరామం సమయంలో వివిధ మంత్రిత్వశాఖల గ్రాంట్ల డిమాండ్లను పార్లమెంటరీ సంఘాలు పరిశీలిస్తాయి. ”జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హయాంలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాలను ఈ సమావేశాల్లో ఎత్తి చూపాలని నిర్ణయించాం” అని సీసీపీఏ బ’ాటీ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు విలేఖర్లకు తెలిపారు. ప్రస్తుతం రాజ్యసభలో 9 బిల్లులతో పాటు మొత్తం 66 బిల్లులు పార్లమెంటులో పెండింగులో ఉన్నాయి. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు అధికార బీజేపీతోపాటు ప్రతిపక్షం కాంగ్రెస్ ఇతర పార్టీలు సన్నాహాకాలు ప్రారంభించాయి.




