హైదరాబాద్
జనం సాక్షి: అధికారుల అవినీతిపై సమాచారమందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నంబర్‌కు నాలుగురోజుల్లో 10 వేల ఫోన్ కాల్స్ వచ్చాయని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తెలిపారు. ఫోన్ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులపై ఇవాళ ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం ఫిర్యాదుల్లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు 499 వచ్చాయని తెలిపారు. ఈ ఫిర్యాదుల్లో నల్లగొండ నుంచి 82 ఫిర్యాదులు రాగా..మహబూబ్‌నగర్-60,వరంగల్-61,రంగారెడ్డి-59, కరీంనగర్-48,హైదరాబాద్-38, నిజామాబాద్-32,మెదక్-45, ఆదిలాబాద్-22, ఖమ్మం నుంచి 52 ఫిర్యాదులు
వచ్చినట్టు వెల్లడించారు. ఈ ఫిర్యాదుల్లో ఎక్కువగా పెన్షన్, సివిల్ సప్లై, హౌసింగ్‌కు సంబంధించినవే ఉన్నాయని తెలిపారు. ఆధారాలున్న ఫిర్యాదులపై కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
జనం సాక్షి: అధికారుల అవినీతిపై సమాచారమందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నంబర్‌కు నాలుగురోజుల్లో 10 వేల ఫోన్ కాల్స్ వచ్చాయని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తెలిపారు. ఫోన్ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులపై ఇవాళ ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం ఫిర్యాదుల్లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు 499 వచ్చాయని తెలిపారు. ఈ ఫిర్యాదుల్లో నల్లగొండ నుంచి 82 ఫిర్యాదులు రాగా..మహబూబ్‌నగర్-60,వరంగల్-61,రంగారెడ్డి-59, కరీంనగర్-48,హైదరాబాద్-38, నిజామాబాద్-32,మెదక్-45, ఆదిలాబాద్-22, ఖమ్మం నుంచి 52 ఫిర్యాదులువచ్చినట్టు వెల్లడించారు. ఈ ఫిర్యాదుల్లో ఎక్కువగా పెన్షన్, సివిల్ సప్లై, హౌసింగ్‌కు సంబంధించినవే ఉన్నాయని తెలిపారు. ఆధారాలున్న ఫిర్యాదులపై కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.




