Wednesday, 4 November 2026

వడాయిగూడెంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

భువనగిరి (జనం సాక్షి ):–తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్దాల ఉత్సవాల్లో భాగంగా ఈనెల 18 వ, తేదీన సాయంత్రం 5.00 గంటలకు ఎమ్మెల్యే శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్న గ్రామ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ తెలిపారు. వడాయిగూడెం కమాన్ నుండి డప్పుల చప్పుళ్లు, బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా బయలుదేరి కొత్త కాలనీలో ఎస్ డి ఎఫ్ నిధులు 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సిసి రోడ్లు, భూగర్భ డ్రెయినేజీ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభిస్తారు. అక్కడే వడాయిగూడెం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జక్కుల చంద్రయ్య యాదవ్ ఇంట్లో ఎమ్మెల్యే మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులకు టీ బ్రేకు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అనంతరం ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ పనులకు శంకుస్థాపన. వడాయిగూడెం చెరువు కట్ట అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. అలాగే గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు, శ్మశానవాటికలో పరమ శివుని విగ్రహం, గ్రామంలో ప్రాథమిక పాఠశాల వద్ద జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ఎమ్మెల్యే గారి చేతులమీదుగా ప్రారంభం జరుగుతుందని సర్పంచ్ చెప్పారు అనంతరం సాయంత్రం 7.00 గంటలకు గ్రామ బొడ్రాయి సెంటర్‌లో సభ ఏర్పాటు. తదుపరి గ్రామ ప్రజలందరికీ అక్కడే భోజనాలు ఏర్పాటు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి మనీష్ గౌడ్ కోరారు.