ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రత్యామ్నాయం కాదు: బర్దన్‌

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పేర్కొన్న ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనపై వామపక్షాలు పెదవి విరిచాయి. కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ సరైన ప్రత్యామ్నాయం కాదని సీపీఎం సీనియర్‌నేత బర్దన్‌ వ్యాఖ్యానించారు. కొందరు ఎంపీలు కలిసి కేంద్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని బర్దన్‌ అన్నారు.