సూర్యాపేట ప్రతినిధి, ఫిబ్రవరి 10 (జనంసాక్షి) : సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి శివస్వాములు శుక్రవారం శ్రీశైలానికి కాలినడకన బయలు దేరారు.విద్యానగర్ లోని శ్రీరామ లింగేశ్వర సహిత త్రిశక్తి అయ్యప్ప ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శివమాలధారణ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఇరుముడి కట్టుకుని పగిళ్ల శరత్ శివస్వామి ఆధ్వర్యంలో పట్టణంలో ఊరేగింపు నిర్వహించి శ్రీశైలానికి పాదయాత్రను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.శివమాలధారణను స్వీకరించి నిష్టగా దీక్షను పూర్తి చేసుకున్న స్వాములపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని అన్నారు.ఆధ్యాత్మిక భావనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. శ్రీశైలానికి మూడోసారి పాదయాత్రతో వెళ్లడం గొప్ప విషయమన్నారు.ఈ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.భవిష్యత్తులో శివస్వాములు ఇంకా ఎక్కువమందితో పాదయాత్ర చేసి ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో శివ స్వాములు పగిళ్ల శరత్, ధరావత్ మల్సూర్, నాగరాజు, మోహన్, రవి, కృష్ణ, లెనిన్, సైదులు, బీఆర్ఎస్ నాయకులు దేవరకొండ జనార్ధన్, కోన ఎల్లయ్య, వీరయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




