Tuesday, 3 November 2026

సమిష్టిగా పని చేద్దాం.. శాంతిభద్రతలు పరిరక్షిద్దాం

 

 

 

 

 

ఎస్పీ అఖిల్ మహాజన్ .రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా బాధ్యతల స్వీకరణ.రాజన్న సిరిసిల్లబ్యూరో. జనవరి 27. (జనం సాక్షి).. సమిష్టిగా పనిచేసి శాంతి భద్రతలు పరిరక్షిద్దామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహించే వివిధ పోలీస్ విభాగాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఇందులో భాగంగా జిల్లా కార్యాలయములోని ఆర్మూడ్ రిజర్వ్ విభాగంతో పాటు హోంగార్డ్స్ ,యం.టి.,కమాండ్ కంట్రల్, బాంబ్ డిస్పోజల్ విభాగం,ట్రాఫిక్ కౌన్సిలింగ్ సెంటర్, కంట్రోల్ రూం,డాగ్ స్కాడ్,ఆర్.ఐ, కన్స్యూమర్ స్టోర్స్, అదనపు డిసిపిలు, ఇతర పోలీస్ అధికారుల కార్యాలయాలను అధికారులతో కల్సి పరిశీలించారు.

ఈ సందర్భంగా కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది నిర్వర్తిస్తున్న విధులను జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులను అడిగితెలుసుకున్నారు.
అనంతరం ఆర్మూడ్ రిజర్వ్ విభాగం సిబ్బందితో ఎస్పీ ముచ్చటిస్తూ సిబ్బందికి ఏదైనా సమస్యతో వుంటే ఎప్పుడైనా తనను కలుసుకోవచ్చని లేదా సంక్షిప్త మేసేజ్ ద్వారా కూడా తమ సమస్యను తెలియజేసుకోవచ్చని. ముఖ్యంగా సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని,అదే విధంగా,సిబ్బంది సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తాని తెలిపారు. సిబ్బందికి విశ్రాంతి కల్పించడంతో పాటు వారు తెలియజేసే సమస్యలపై స్పందిస్తానని అన్నారు.
ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐ లు కుమారస్వామి, రజినీకాంత్, యాదగిరి, ఆర్.ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది,ఉన్నారు.