ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 28 : కమాన్‌పూర్ మండల ఫోటో,వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు ఆర్. ప్రేమ్ సాగర్ క్యాన్సర్ వ్యాధితో అకాల మరణం చెందగా తెలంగాణ రాష్ట్ర ఫోటో,వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ కుటుంబ భరోసా పథకం ద్వారా అందించిన 1,50,000/- రూపాయల చెక్కును పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ మరియు కమాన్‌పూర్ మండల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర,జిల్లా, మండల అసోసియేషన్ లకు ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రెడ్డి భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోగుల విజయకుమార్, జిల్లా కోశాధికారి వనపర్తి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి డివిఆర్ తులసి, కమాన్‌పూర్ మండల అసోసియేషన్ అధ్యక్షులు కొండి అనిల్, జిల్లా నాయకులు వడ్లకొండ తిరుపతి,కోశాధికారి జంగిలి పోశాలు, తోట శ్రీనివాస్, ముత్యం సతీష్, తదితరులు పాల్గొన్నారు.