Thursday, 5 November 2026

ఫోర్జరీతో మున్సిపల్ సెస్ అధికారులను తప్పుతో పట్టించారు..

ఫోర్జరీతో మున్సిపల్ సెస్ అధికారులను తప్పుతో పట్టించారు…ఫోర్జరీతో మున్సిపల్ సెస్ అధికారులను తప్పుతో పట్టించారు…
సిరిసిల్ల గార్మెంట్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దిడ్డి రాజు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 26. (జనంసాక్షి). సాక్షాత్తు మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సెస్ మున్సిపల్ అధికారులను తప్పుదోవ పట్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల గార్మెంట్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దిడ్డి రాజు కోరారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ లో మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సెస్ సభ్యత్వం కోసం నమోదు చేసుకున్న సత్యవాడ రమాదేవి పేరుతో వినియోగదారులుగా నమోదు చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. తాము సమాచార హక్కు చట్టం ద్వారా మున్సిపల్ అధికారుల నుండి తీసుకున్న సమాచారం లో తెలిపిన వివరాలకు వాస్తవాలకు పొంతన లేకుండా ఉందని అన్నారు. ఈ విషయం మున్సిపల్ కమిషనర్ ,సెస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. పోర్జరి చేసి అధికారులను తప్పదు పాటించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వేముల శ్రీనివాస్ ,భూమేష్, శీను, తదితరులు పాల్గొన్నారు.