Thursday, 5 November 2026

రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి*

రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి*
మెట్ పల్లి టౌన్ ,నవంబర్ 25,
జనంసాక్షి:
ప్రభుత్వం వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి రోజులు గడిచిన నెరవేర్చడం లేదని కోరుట్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు అన్నారు. ఆయన నేడు మెట్పల్లి పట్టణ కేంద్రంలో స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడుతూ 70 రోజుల సుదీర్ఘ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వీఆర్ఏలతో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఐఏఎస్ మునుగోడు ఎలక్షన్ అనంతరం వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో ఎంతో ఆనందంతో విధుల్లో చేరారని కానీ నేటికీ ఆయన ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో వీఆర్ఏలు ఆందోళన చెందుతున్నారని కొమిరెడ్డి రాములు ఆవేదన వ్యక్తం చేశారు.వీఆర్ఏలు ప్రభుత్వ నిబంధనలు మేరకు విధులు నిర్వర్తించే కష్టజీవులని వారి డిమాండ్లను పరిష్కరించకుండా కాలయాపన చేయడం అట్టడుగు వర్గాలను అవమానించినట్టేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేనిచో కోరుట్ల నియోజకవర్గంలోని 4 మండలాల వీఆర్ఏలు బస్సుల్లో బయలుదేరి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ముందు నిరసన తెలుప గలరని కొమిరెడ్డి రాములు హెచ్చరించారు.