బంగారమ్మ గుడికి రూ.1,00,116 లు విరాళం అందజేసిన జెడ్పిటిసి
మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో చాలా ప్రసిద్ధి గాంచిన బంగారమ్మ దేవాలయం నూతనంగా నిర్మిస్తున్న ఈ దేవస్థానికి జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యుడు, స్థానిక జడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తా గ్రామస్తుల కోరిక మేరకు తన సొంత డబ్బులు ఒక్క లక్ష,ఒక వంద, 16 రూపాయలు బంగారమ్మ దేవాలయం నిర్మాణానికి నిర్వహణ సభ్యులకు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనూష అశోక్ గౌడ్, ఉప సర్పంచ్ సంధ్య వెంకట్ స్వామి, మాజీ సర్పంచ్ లింగంయాదవ్, పటేల్ రాములు, యాదాగౌడ్, ఆంజనేయులు, సతీష్, తిమ్మాపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
శివ్వంపేట మండలం చిన్న గొట్టుముక్ల గ్రామానికి చెందిన సయ్యద్ ఖదీర్ వాళ్ళ అమ్మ సయ్యద్ ఖాదర్ ఉన్నిసా అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా మంగళవారం బాధిత కుటుంబానికి పరామర్శించి, 5 వేల నగదు ఐదువేల రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు నసీరుద్దీన్, ఎంపీటీసీ దశరథ, ఎత్తేశం, సలీం, పాపయ్య, గౌస్ లతో పాటుగా బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.