బంగ్లా శరణార్థులవల్లే అస్సాంలో హింస: అద్యానీ

గౌహతి: బంగ్లాదేశ్‌ నుంచి అస్సాంలోకి అక్రమంగా తరలివచ్చినవారే అస్సాంలో చెలరేగిన హింసకు కారకులని భాజపా నేత అద్వానీ అన్నారు. బోడోలు, బంగ్లాదేశ్‌ ముస్లింల మధ్య జూలై 19 నుంచి వారంపాటు జరిగిన ఘర్షణల్లో 56 మంది మృతి చెందగా లక్షలమంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలను పర్యటించి వచ్చినఅ అద్వాని ఈ రోజు గౌహతిలో మీడియాతో మాట్లాడారు. చొరబాట్లను ఆరికట్టటంలో ప్రభుత్వం విఫలం కావటంవల్ల ఈ రోజు అస్సామీలు తమ గడ్డపై తామే విదేశీయులుగా బతకాల్సివస్తోందన్నారు.

తాజావార్తలు