భువనగిరి రూరల్ జనం సాక్షి ఏప్రిల్ 5 , యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామంలో బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ బిజెపి మండల నాయకులు కాసాని శ్రీనివాస్ నాయకత్వంలో భువనగిరి -నల్గొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నాయకులు మాట్లాడుతూ బి ఆర్ఎస్ మిషన్ భగీరథ నుండి పేపర్ లీకేజీ అన్ని సవ్యంగా జరగకుండా దొంగ బుద్ధి చూపు తున్నారనిఅన్నారు. ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వంతోప్రజలు విసిగిపోయారని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని ఎగ్జామ్ పేపర్ తో ముడి పెట్టడం సరికాదని వా పోయారు. ఈ ధర్నా కార్యక్రమంలో టి. రాములు, గాదే శేఖర్, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకట చారి, జక్క నర్సిరెడ్డిలు పాల్గొన్నారు.




