– టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియామకం
– ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ
హైదరాబాద్, నవంబర్19(జనంసాక్షి) : ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణెళిష్‌కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక పదవి అప్పగించింది. టీపీసీసీ అధికార ప్రతినిధిగా గణెళిష్‌ను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి లేఖను విడుదల చేశారు. ఈ మేరకు ఉత్తర్వుల లేఖను ప్రముఖ నిర్మాత బీఏ రాజు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రాజేంద్రనగర్ టికెట్ ఆశించి భంగపడ్డ సినీ నిర్మాత బండ్ల గణెళిశ్‌ను బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇందులో భాగంగా ఆయనకు టీపీసీసీ అధికార ప్రతినిధి పదవిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జనసేన అధినేత, పవన్ కల్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణెళిశ్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. పార్టీలో చేరినప్పటి నుంచి పలు టీవీ చానళ్లలో హడావుడి చేస్తూ.. ఈ సారి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు, రాజేంద్ర నగర్ టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఓ చానెళ్లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. అంతేకాకుండా తమ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచి.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం కూడా చెప్పారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది. మహాకూటమి ఒప్పందంలో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో గణెళిశ్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఆ పార్టీ తరపున గణెళిశ్ గుప్తా బరిలోకి దిగుతున్నారు. దీంతో బుజ్జగింపుగా పార్టీ అధికార ప్రతినిధి పదవి కేటాయించింది.
బండ్ల గణెళిశ్ కు కీలక పదవి




