Friday, 6 November 2026

ముందు రాష్ట్రంలో..  అవినీతిని అంతమొందించు

– తరువాత దేశాన్ని రక్షించొచ్చు
– ఏపీ పాలన అవినీతి మయంగా మారింది
– 7వేల కోట్లు ఉపాధి నిధులు దారిమళ్లించారు
– వైసీపీ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్‌, నవంబర్‌19(జ‌నంసాక్షి) : సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రం లో పేరుకుపోయిన అవినీతిని పట్టించుకోకుండా.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దేశాన్ని రక్షిస్తా అనడం విడ్డురంగా ఉందని వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధప్రదేశ్‌లో జరుగుతున్న అవినీతి…టీడీపీ నాయకుల అక్రమాలపై కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. జాతీయ ఉపాధి హావిూ పథకం కింద కేంద్రం రూ. 20 వేల కోట్లు ఇస్తే రూ.7వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. ఏడు వందల కోట్ల రూపాయలను ఒక విూడియాలో ప్రచారం కోసం ఇచ్చారని బొత్స ఆరోపించారు. రూ.450కోట్లు విలువగల భూమిని రూ.45లక్షలకే ప్రభుత్వం కేటాయించిన దాఖలాలు ఉన్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి తారా స్థాయికి చేరిందని ప్రభుత్వ ఉన్నతాధికారులే చెబుతున్నారని విమర్శించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల్లో అవకతవకలు, విశాఖపట్నం భూముల కుంభకోణం, ఇలాంటి వాటిని బాబు పట్టించుకోరని విమర్శించారు. టీడీపీ నాయకుల బండారం బయటపడుతుందనే సీబీఐ ప్రవేశ రద్దుపై జీవో తెచ్చారని ఆరోపించారు. తప్పులు చేసి బయట దేశాలకు పారిపోయిన విధంగా దేశంలో తప్పు చేసిన నాయకులు ఏపీ లో తలదాచుకునే విధంగా బాబు పాలన ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబులాంటి మోసకారితో కాంగ్రెస్‌ జతకట్టడమేంటని ప్రశ్నించారు. జాతీయ పార్టీలు చంద్రబాబు అవినీతి పాలన పై మాట్లాడవలసిన అవసరం ఉందని బొత్స అభిప్రాయపడ్డారు.