Wednesday, 4 November 2026

బందు జయప్రదం

 కడెం జూలై 20 (జనం సాక్షి) విద్యారంగ సమస్యల పరిష్కారం చెయ్యాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాలలు,కళాశాలలు బందు పాటించాలని కోరుతూ బి డి ఎస్ ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ భూక్య రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ పాఠ్య పుస్తకాలు అందించాలని. విద్యార్థులు అందరికీ యూనిఫామ్ ఇవ్వాలి. నూతన జాతీయ విద్యా విధానం 20 20 రద్దు చేయాలి. మధ్యాహ్న భోజన నిధులు పెంచి పెండింగ్ బిల్లులు విడుదల చేసి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ఎం ఈ ఓ మరియు డి ఈ ఓ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రించి నియంత్రణ చట్టం తేవాలి. ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలి అధ్యాపకుల పోస్టులు భర్తీ పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి ఈ కార్యక్రమంలో జేవింద్ మాలవత్ PDSU  జిల్లా కార్యదర్శి పాల్గొన్నారు