నాంపల్లి జులై 30 (జనం సాక్షి ) ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో వందలాది మంది విద్యార్థులు బడికి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. నాంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు విద్యార్థులు ఆర్టీసీ బస్సు లేక వందలాది మంది విద్యార్థులు బడులకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. నాంపల్లి నుండి చండూరు మండలానికి ఇంతకుముందు మూడు, నాలుగు బస్సులు నడిపించేవారు కానీ కరోనా కారణంగా ఒక్క బస్సు కూడా నడపడం లేదు. ఇప్పుడు విద్యార్థులు బడులకు వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. బడికి వెళ్ళే సమయానికి బస్సులు వేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. చేసేదేమీలేక విద్యార్థులంతా నడుచుకుంటా నో, సైకిళ్లపై నో , విద్యార్థుల తల్లిదండ్రులు ద్విచక్రవాహనాలపై నో, ఆటోలలనో విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. మరొక్క ఆటో వస్తదో లేదో అని , ఆటోకు ఇరువైపులా విద్యార్థులు వెళ్లాడా పాడుతూ ప్రయాణిస్తున్నారు. ఆటోలో ప్రయాణం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తున్న, తప్పని పరిస్థితుల్లో ఆశ్రయించాల్సి వస్తోందని విద్యార్థులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలన్న ఆలోచన చేయడం లేదని విమర్శిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చేసుకొని ఆర్టీసీ బస్సులను నడిపించాలని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
Attachments area




