Wednesday, 4 November 2026

రాష్ట్రం సుభిక్షంగా ఉండి రైతులందరూ క్షేమంగా ఉండాలి

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలోని రైతులు చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ని ఎడ్ల బండి పైన బొక్కలగుట్ట బ్రిడ్జి నుండి సుమారు పదిహేను వందల మంది రైతులు భారీ ర్యాలీ నిర్వహించి సాదర స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ శనివారం మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది దినోత్సవాలలో భాగంగా రెండవ రోజు రైతు దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి రైతులందరూ క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్, బొక్కలగుట్ట గ్రామ సర్పంచ్ బొలిశెట్టి సువర్ణ కనకయ్య, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బలికొండ కిషన్, సర్పంచ్ తిరుపతిరెడ్డి, ఎంపీడీవో శశికళ, ఎమ్మార్వో సంపతి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, పి ఎస్ సి ఎస్ సి వైస్ చైర్మన్ మండ విక్రం గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి రాజేష్, స్థానిక ఎంపీటీసీ తిరుపతి, మునిసిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఇంచార్జ్ గాండ్ల సమ్మయ్య, కౌన్సిలర్లు పారుపల్లి తిరుపతి, జాడి శ్రీనివాస్, రేవెల్లి ఓదెలు, పనస రాజు, బిఆర్ఎస్ యువ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.