వడలలో బూత్ కమిటీ నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు.
జనం సాక్షి ఉట్నూర్.
ఉట్నూర్ మండల కేంద్రంలోని బోయవడ, మొమిన్ పూర, శాంతి నగర్, వడలలో మంగళవారం బిఅర్ఎస్ మండల నాయకులు బూత్ స్థాయి కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ వి జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ మాట్లాడుతు ఖానాపూర్ నియోజవర్గం ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామంలో బూత్ స్థాయి కమిటీ నిర్వహించి బిఆర్ఎస్ పార్టీనీ బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు హైమద్ అజీముద్దిన్ పోశన్న శుకథ్ కొల్లూరి స్వామి బలవంత్ రావు రవి మనోహర్ తదితరులు ఉన్నారు.




