హైదరాబాద్ : పాఠశాల విద్యాశాఖా మంత్రి శైలజానాథ్ నిప్పులాంటి నిజాన్ని వెల్లడించారు. లక్షా ఆరవై వేల మంది చిన్నారులు బడి బయటే ఉన్నారని పేర్కొన్నారు. వాళ్లు పాఠశాలలకు వెళ్లడంలేదని తెలిపారు. ఇవాళ ఆయన జూబ్లీహాల్‌లో ‘విద్యాహక్కు చట్టం’పై ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
10 మందిలోపు విద్యార్థులుంటే బడి మూసివేస్తం : మంత్రి
రాష్ట్రంలో పది మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలను మూసివేస్తామని మంత్రి శైలజానాథ్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,284 ప్రాథమిక పాఠశాలల్లో పదిమంది లోపు విద్యార్థులున్నట్టు మంత్రి వివరించారు. 984 పాఠశాలల్లో కనీసం ఒక్క విద్యార్థి కూడా లేరని ఆవేదనతో అన్నారు. నాలుగు వందల పాఠశాలల్లో నలుగురు విద్యార్థులు మాత్రమే విద్యార్జన చేస్తున్నారని స్పష్టం చేశారు.




