Thursday, 5 November 2026

సీఎం సభకుభారీగా తరలిన బీఆరెఎస్ శ్రేణులు.

 

 

 

 

 

 

 

బెల్లంపల్లి, జూన్ 9, (జనంసాక్షి )మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయ సముదాయం ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ సభకు బెల్లంపల్లి నియోజకవర్గంనుంచి బీఆరెస్ శ్రేణులు భారీగా వాహనాలలో తరలి వెళ్లారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నేతృత్వంలో బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట్, నెన్నెల, బిమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల నుంచి బస్సులు, ఇతర వాహనాల్లో మంచిర్యాలలో నిర్వహించే బహిరంగ సభకు దండుగా కదిలారు. స్థానిక బీఆరెస్ బీఆరెస్ శ్రేణులను భారీగా తరలించడంలో సఫలం అయ్యారు. జై తెలంగాణ నినాదాలతో దారులన్నీ మంచిర్యాలకు బయలుదేరాయి.