Wednesday, 4 November 2026

బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సెల్ఫీ నేత భట్టి విక్రమార్క

 

 

 

 

 

 

 

 

జనం సాక్షి/భువనగిరి: తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోని జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గురువారం డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణ కేంద్రంలో పీపుల్ మార్స్ కార్నర్ మీటింగ్ పాదయాత్రలో భాగంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సమావేశం నిర్వహించిన సేవాదళ్ పిట్టల బాలరాజ్ గజమాలతో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి శాలువా కప్పి ఆహ్వానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఎస్టీతో వివిధ రకాల వ్యాపారస్తులు అనేక రకాలుగా అనేక ఇబ్బంది పడుతూ జీఎస్టీ పన్నును దౌర్జన్యంగా వసూలు చేసి పేద మధ్య రకాల ప్రజలను గురి అయి తోడ్పాటు ఇబ్బందులకు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జీఎస్టీ పనులు పూర్తిగా తొలగిస్తామని అన్నారు. చేనేత కార్మికుల్లో వెలుగులు నింపే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థుల బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటన ఉన్నాయని గుర్తు చేశారు. నిరుద్యోగులకు లేక నోటిఫికేషన్ వేసి ప్రశ్న పత్రాలను లీకేజీ చేసి, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చి వారి కుటుంబాలని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీ సబ్ ప్లాన్ చట్టం అమలులోకి తెచ్చి బడ్జెట్లో సగం నీధులు బీసీలకే ఖర్చు చేసి, ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులను పారదర్శకంగా భర్తీ చేసి, తక్షణమే వివిధ రకాల శాఖలలో ఖాళీలు భర్తీ చేసేందుకు తగిన న్యాయం చేస్తామని అన్నారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలలో రైతులకు సాగునీరు అందించి రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు గిట్టుబాటు ధర అందజేస్తామని అన్నారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని ఆరోపించారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, అనేక లక్షల కోట్లు స్కామ్ చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు. డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరోగ్య శ్రీ విద్యార్థులకు ఫీజు రియంబర్మెంటు నిధులు ఇవ్వక ప్రజలను నిధులు కేటాయించకుండా చాప కింద నీరులా చేస్తున్న ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం భువనగిరి నియోజకవర్గంలో అభివృద్ధికి పేరిట బినామీల పేరుతో దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు త్రిబుల్ ఆర్ రైతులు భూములు తీసుకొని స్థానిక ఎమ్మెల్యే అలైన్మెంట్ వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులు భూములు త్రిబుల్ ఆర్ రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అన్నారు భువనగిరి పట్టణంలో వేసిన సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలలో నాణ్యత లేకుండా పనులు చేపట్టారని ఆరోపించారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చి మైనార్టీ సోదరులకు మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ సభ్యులు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ రాజయ్య డీసీసీ అధ్యక్షుడు కుంభం అనీల్ కుమార్ రెడ్డి, ఆలేరు ఇన్చార్జి బిర్ల ఐలయ్య కుడుగుల నాగేష్ పాల్వాయి శ్రవంతి, తంగళ్ళపల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్, బీసుకుంట్ల సత్యనారాయణ, చల్లగురగుల రఘుబాబు కూర వెంకటేష్ నజీర్ నాగరాజ్ గుర్రాల శ్రీనివాస్ కౌన్సిలర్ , సల్లావుద్దీన్ వాడిచెల్ల లక్ష్మి కృష్ణ యాదవ్ పడిగల రేణుక ప్రదీప్ కైరం కొండ వెంకటేష్ రపాక నరసింహ, బర్రె నరేష్ బబ్లు వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ ఎల్ ఎస్ యు ఐ యూత్ కాంగ్రెస్ ఇంజన్న నరీష్ పుట్ట గిరీష్ హిరేకర్ శ్రీనివాస్ఎడమ పవన్ అమనత్, కొల్లు రాజు వాసుదేవ రెడ్డి మనోజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.