వీణవంక జూన్ 12 (జనం సాక్షి) వీణవంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభం అయిన సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఉదయం విద్యార్థులతో కలిసి ప్రధాన వీధుల నుండి స్థానిక బస్టాండ్ కూడాలి వరక బడిబాట ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు తన సొంత ఖర్చుతో నోట్ బుక్స్ ను అందించారు. అనంతరం 1978-79 ఈ సంవత్సరానికి చెందిన పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు అందించిన 40 వేల రూపాయలను నగదు తో కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు అదనపు తరగతి గదులు, డైనింగ్ హాల్, మంచినీటి సంపుతో పాటు, 8, 9,10 తరగతి చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ మాధ్యమంలో బోధించేందుకై ఖరీదైన టీవీలను, గ్రీన్ చాక్ పీస్ బోర్డులను సమకూర్చిందన్నారు. అందువల్ల తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు.




