మక్తల్ జనవరి 06 (జనంసాక్షి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బిఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికి రైతు ప్రభుత్వమని అన్నారు.
తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసిన ఘనత సిఎం కెసిఆర్ దేనని అన్నారు. నేడు అసెంబ్లీలో 2023-2024 బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్రావురూ.2,90,395 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు.ఇది పూర్తిగా పేదల సంక్షేమం కోసమే అని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం లో అన్ని కులాలకు అవసరమయ్యే అన్ని రకాల సహకారం అందించే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసిఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమం లో టౌన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, అధికార ప్రతినిధి రామలింగం, యువత అధ్యక్షుడు మధు పాల్గొన్నారు.




