30 నుంచి 40 ఏండ్లు బండకింద అవిసిన మాజీ నల్ల బంగారు నేల బతుకులు వాళ్ళవి!ఈదేశం లో వెలుగును ఉత్పత్తి, చేసే, నల్ల బంగారం గా పిలువబడే రాక్షసి బొగ్గును పుట్టెడు బండ కిందకు, భూమిని చీల్చు కుంటూ వెళ్లి తమ రక్తాన్ని,చెమటగా మార్చి ఉత్పత్తి చేసిన రిటైర్డ్ కార్మికులు! వారి బతుకుల్లో చీకటి మాత్రమే కనిపిస్తున్నది! ముఖ్యంగా 1998 నుంచి 2010 మధ్యన పదవి విరమణ గావించిన వారికి అతి తక్కువ 300,400,500,1000,2000 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తున్నది! 5,6,7 వేజ్ బోర్డు ల లో రిటైర్డ్ అయిన వారి పరిస్థితి దీనంగా ఉంది! కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి కనీస పెన్షన్ 10 వేలు అందరికీ ఉండే విధంగా సీఎం కెసిఆర్ ను రిటైర్డ్ సింగరేణి కార్మికుల సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్,శ్రీరాంపూర్ లో వృద్ధాశ్రమం నెలకొల్పడానికి ఎనలేని కృషి చేసిన, సీసీసీ లో రిటైర్డ్ సింగరేణి కార్మికుల కాలనీ వ్యవస్థాపకుడు,81 ఏండ్ల మాజీ సింగరేణి కార్మికుడు లక్కర్సు ఆగయ్య సీఎం కెసిఆర్ ను కోరుతున్నారు!అందరికీ ప్రభుత్వ పెన్షన్ ఇవ్వాలని,గోల్డెన్ హ్యాండ్ షేక్ లోనూ రిటైర్డ్ అయిన వారికి ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని,డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని,సింగరేణి మాజీ సీఎండీ జిపి.రావ్ కాలంలో ఉద్యోగంలో చేరిన వారికి మారు పేర్లు ఉన్నాయని,చాలా మందికి పెన్షన్ లు ఆపారు! వారంతా ఇబ్బంది పడుతున్నారు! వారి సమస్య ను పరిష్కారం చేయాలని,ఆగయ్య కోరారు! పెరిగిన ధరలకు అనుగుణంగా పెన్షన్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆగయ్య కోరారు! పెన్షన్ చట్టం లో మూడేండ్ల కోసారి పెన్షన్ పెంచాలనే,నిబంధన ఉన్నా యాజమాన్యం పెన్షన్ పెంచడం లేదని ఆగయ్య ఆవేదన వ్యక్తం చేశారు!ముఖ్యమంత్రి కెసిఆర్ పెన్షనర్ల సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించాలని ఆగయ్య విజ్ఞప్తి చేశారు! సీఎం కెసిఆర్ ఈనెల 9 న మంచిర్యాల కు వస్తున్నారు! ఈ సందర్బంగా తమ తమస్యల మీద విజ్ఞాపన పత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు! లక్కర్సు ఆగయ్య!
‘బతికే’ మార్గం చూపండి!కెసిఆర్ సారూ




