Monday, 2 November 2026

బతుకమ్మ చీరెలు.. కొత్త కొత్త డిజైన్లు  

 రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుగా అందిస్తున్న బతుకమ్మ చీరెలు ఆడబిడ్డలు మెచ్చేలా వంద డిజైన్లతో తయారవుతున్నాయి. ఆడబిడ్డలు మెచ్చేలా సద్దుల చీరెలు రూపుదిద్దుకుంటున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చినట్లు.. ఈసారి ఆడబిడ్డలు కూడా తీరొక్క వర్ణాలతో కనిపించనున్నారు. కార్మికక్షేత్రం సిరిసిల్లలో నూరు వర్ణాల్లో చీరెలు ముస్తాబవుతున్నాయి. చెక్స్.. లైనింగ్ తదితర పది విభిన్న డిజైన్లతో బతుకమ్మ చీరెలు కొత్త మెరుగులను అద్దుకుంటున్నాయి. ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో రూ. 320 కోట్ల విలువైన కోటి చీరెల ఆర్డర్ సిరిసిల్లకు దక్కగా, ఉత్పత్తి ముమ్మరంగా సాగుతున్నది. మొత్తంగా 6 కోట్ల మీటర్ల ఉత్పత్తి లక్ష్యంలో 4కోట్ల మీటర్లు సిద్ధం చేశారు.