Monday, 2 November 2026

మానవత్వాన్ని చాటిన ట్రాఫిక్‌ సీఐ

నాగోలు, : నగరంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ఎల్బీనగర్‌ నుంచి సాగర్‌రింగ్‌రోడ్డుకు వెళ్లే దారిలో నడుములోతు నీరు నిలిచిపోయింది. ఈ రోడ్డులో నిలిచిన వరద నీటిని తక్కువగా అంచనా వేసిన ఓ యువకుడు తన ద్విచక్ర వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దీంతో వరద నీటిలో వాహనం ఆగిపోయింది. బైకు వెనుక సీట్లో కూర్చున్న ఆ యువకుడి తండ్రి సైతం నీటిలో దిగవలసి వచ్చింది. ఆయన కుడికాలు పాదానికి ఇటీవల తీవ్రగాయం కావడంతో దానికి పట్టీకట్టి.. వానకు నానకుండా ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టారు. కానీ.. వీరి బైకు వరద నీటిలో ఆగిపోవడంతో గాయమైన కాలు తడవకుండా ఒడ్డుకు రావడం అసాధ్యమైపోయింది. కానీ.. అక్కడే ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ నాగమల్లు ఈ విషయాన్ని గమనించి ద్విచక్రవాహనం వద్దకు చేరుకున్నాడు. ఇబ్బంది పడుతున్న ఆ యువకుడి తండ్రిని తన వీపుపై మోస్తూ వరద నీటిలో నడుస్తూ రోడ్డు అవతలికి చేర్చాడు.