మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బిఆర్ఎస్ఎస్
మోత్కూరు నవంబర్ 28 జనంసాక్షి : బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్మెర్ధం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే అని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ , బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గడ్డం నర్సింహ్మ అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే 132 వ వర్ధంతి సందర్భంగా సోమవారం నాడు మోత్కూరులో ఆయన విగ్రహానికి బీసీ రిజర్వేషన్ సాధన సమితి, బీసీ యువజన సంఘం సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్,నర్సింహ్మ మాట్లాడుతూ విద్య,వివక్ష, పేదరికం, ఆర్ధిక అసమానత్వం నిర్ములించడానికి నిరంతరం కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, గుండగొని రామచంద్రు, బోళ్ల హన్మంత్, ,ఎడ్ల శ్రీనివాస్, గాదె వెంకటీశ్వర్లు, కారుపోతుల శ్రీనివాస్, మందుల మల్లేష్, బత్తిని ప్రభాకర్ ,రాచకొండ శ్రీనివాస్ కిరణ్,మహేష్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.




