బద్దం ఎల్లారెడ్డి పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తాం…
సిపిఐ పట్టణ కార్యదర్శి పంతం రవి.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 4. (జనంసాక్షి). తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని సిపిఐ పట్టణ కార్యదర్శి పంతం రవి అన్నారు. బుధవారం కార్మిక భవన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో రవి మాట్లాడుతూ మంగళవారం జరిగిన కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి 44 వర్ధంతి సభాను విజయవంతం చేసేందుకు తరలివచ్చిన ప్రజలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి అందించిన స్ఫూర్తితో రానున్న రోజుల్లో ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు. సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు సామల మల్లేశం, రమేష్, వేణు, తదితరులు పాల్గొన్నారు.




