నేరుగా పొందేలా అధికారుల చర్యలు
హైదరాబాద్,జనవరి31(జనంసాక్షి): జనన ధ్రువీకరణ పత్రాలు పొండం మరింత సులభతరం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం రాకుండా చేసింది. ఇ-సవ, విూసేవల్లో డబ్బులు కట్టి తిరగాల్సిన పనిలేకుండా, దళారులను ఆశ్రయించాల్సిన అసవరం లేకుండా చేసింది. ఈ పాస్‌వర్డ్‌ల ద్వారా సంబంధిత దవాఖానల అధికారులు ఏరోజుకారోజు జన్మించిన శిశువుల వివరాలను ఈ-బర్త్ పోర్టల్‌లో పొందుపరుస్తారు. ఈ వివరాలను రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పరిశీలించే వీలుంటుంది. తద్వారా ప్రజలే తమ పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలను నేరుగా ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనవరి 1నుంచి జన్మించిన వారి సర్టిఫికెట్లను మాత్రమే ఈ విధానం ద్వారా పొందవచ్చు. ఇప్పటి వరకు జనన ధ్రువీకరణ పత్రాల కోసం సంబంధిత సర్కిల్ మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. లేదా విూసేవా కేంద్రాల చుట్టూ ప్రదిక్షణలు చేయాల్సి వచ్చేది. ఈ క్ర మంలో బ్రోకర్లు తమ చేతివాటం చూపేవారు. ఒక్కో జనన ధ్రువీకరణ పత్రానికి రూ.2 వేల నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేసేవారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జనన ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తు దారులే నేరుగా ఆన్‌లైన్‌ద్వారా గాని లేదా ప్రసవించిన దవాఖానల నుంచిగాని పొందేలా నిబంధనలను మార్చారు. ప్రస్తుతం పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతో పాటు ఇతర కీలక సందర్భాల్లో జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కావడంతో బర్త్ సరి/-టిఫికెట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. దీనిని గమనించిన సర్కార్ జనన ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు ఈ-బర్త్ విధానం ద్వారా మార్గం సుగుమం చేసింది. ఈ విధానం ద్వారా జనన ధ్రువీకరణ పత్రాలను సులభంగా పొందడమే కాక రాష్ట్రంలో రోజువారిగా జన్మిస్తున్న శిశువుల లెక్క పక్కాగా ఉంటుందని అధికారులు తెలిపారు. గర్భిణీలు దవాఖానలో ప్రసవించిన రోజునే వారి పూర్తి వివరాలను సదరు దవాఖాన సిబ్బంది ఏరోజుకారోజు ఈ-బర్త్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. దీనివల్ల ఏ దవాఖానలో ఏరోజు ఎంతమంది జన్మించారో సులభంగా తెలిసిపోతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల జనన ధ్రువీకరణ పత్రాల కోసం మున్సిపల్, విూ-సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. పిల్లలకు పేరు పెట్టుకున్న తరువాత నేరుగా వచ్చి ప్రసవించిన దవాఖాన నుంచిగాని లేదా ఆన్‌లైన్‌ద్వారా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బర్త్ విధానం ప్రభుత్వ దవాఖానలతో పాటు ప్రైవేటు దవాఖానల్లో సైతం అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని వల్ల జిల్లావారిగా ఒకరోజు ఎంత మంది జన్మించారనే లెక్క పక్కాగా ఉంటుందని వివరించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారిగానే కాకుండా దవాఖానల వారిగా ఎంతమంది జన్మించారో సులభంగా తెలుసుకోవచ్చని వైద్యాధికారులు వివరించారు. ఎందుకంటే ఈ నూతన విధానం ఈనెల ఆరంభంలోనే అమల్లోకి వచ్చింది. |శితిసబిఠ.బి|్గ/జీనిణజీనిజీ.ణనీల.తినిలోకి వెళ్లి అక్కడ అడిగిన వివరాలతో పాటు సంబంధిత దవాఖాన సిబ్బంది డెలివరీ సమ్మరీషీట్‌లో జారీచేసిన యూనిక్ ఐడీకోడ్‌ను ఎంటర్‌చేయాలి. వెబ్‌సైట్‌లో ఎంటర్‌చేసిన వివరాల ఆధారంగా సంబంధిత శిశువు జనన దృవీకరణ పత్రం వస్తుంది. దానిని నేరుగా ఇంటిలో నుంచే డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. మరోవిశేషమేంటంటే పిల్లలకు పేరు పెట్టిన తరువాత సదరు పేరును నేరుగా తల్లిదండ్రులే ఈబర్త్ పోర్టల్‌లో ఎంటర్‌చేసి బర్త్‌సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.




