Tuesday, 3 November 2026

మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య

బిచ్కుంద ఏప్రిల్ 03 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల వాజిద్ నగర్ గ్రామానికి చెందిన తోట హన్మండ్లు (58) సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లి ఊరు శివారులోని సెల్ టవర్ కు తాడుతో కట్టి ఉరివేసుకొని చనిపోయినాడని, హన్మండ్లు జీవితంపై విరక్తి చెంది చనిపోయినట్లుగా అతని భార్య విఠ్ఠవ్వ మరియు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైందని ఎస్సై శ్రీధర్ రెడ్డి అన్నారు. గత కొంతకాలం నుంచి మానసిక స్థితి సరిగా లేక బాధపడుతూ ఉండేవాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.