జహీరాబాద్ జులై 6 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని పాస్తాపూర్ గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం జహీరాబాద్ ఎమ్మెల్యే బాబు జగ్జీవన్ రామ్ కు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. 1946 లో నెహ్రూ ప్రభుత్వంలో భారత దేశంలోనే అతి చిన్న వయసులో మొట్టమొదటి కేంద్ర కాబినెట్ కార్మిక శాఖ మంత్రిగానియమితులయ్యారు అన్నారు. భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడుగా రాజ్యాంగంలో సామాజిక న్యాయం అనే పదం చేర్చడం జరిగింది. దాదాపు నలభై ఏళ్లపాటు కేబినెట్ లో వివిధ మంత్రి పదవులు నిర్వహించిన గొప్ప ఘనుడు జగ్జీవన్ రాం అని కొనియాడారు. 1971 లో ఇండో, పాక్ యుద్ధ సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా తన విధిని సమర్థవంతంగా నిర్వహించి దేశ ప్రజల మన్ననలు పొందారని, భారత దేశంలో హరిత విప్లవం, వ్యవసాయాన్ని ఆదునికరించడంలో ఆయన చేసిన కృషి అమోఘం అని ఆయన అన్నారు..ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ విజయకుమార్, తెరాస పట్టణ అధ్యక్షుడు సయ్యెద్ మోహిుద్దీన్ ,ఎస్సి సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు బండి మోహన్,పట్టణ ఉపాధ్యక్షుడు జైరాజ్, ఎస్సి.ఎస్టీ విజిలెన్స్ మెంబర్ రామకృష్ణ బంటు,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు ఎర్రోళ్ల శివప్ప,నాయకులుఇజ్రాయెల్బాబీ, లక్ష్మికాంత్.అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గౌతమ్ మొగులయ్య,అరుంధతి సంఘంవరాలు,మోసెస్,స్వామిదాస్,సు ధాకర్,పిఆర్టియు అధ్యక్షులు తులసి రామ్ రాథోడ్,దళిత నాయకులుబాలరాజ్,జైయప్ప,రాజు,శాం తకుమార్,తదితరులు పాల్గొన్నారు.
Attachments area




