Tuesday, 3 November 2026

బల్దియాకు పెరిగిన ఆన్‌లైన్‌ చెల్లింపులు

చెత్త తరలింపులో పెరుగుతున్న చైతన్యం

హైదరాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): ఆన్‌లైన్‌లో జీహెచ్‌ఎంసి ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్స్‌ ఫీజులను చెల్లించే వెసలుబాటు రావడంతో ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. విూ-సేవా, ఆన్‌లైన్‌, సిటీజన్‌ సర్వీస్‌ సెంటర్స్‌, బిల్‌కలెక్టర్ల ద్వారా చెల్లించేందుకు అత్యధికులు ముందుకు వస్తున్నారు. నగరంలో క్యాష్‌లెస్‌ లావాదేవీలను ప్రారంభించడంలో భాగంగా ఆన్‌లైన్‌ చెల్లింపులను చేపట్టేందుకు జీహెచ్‌ఎంసి ప్రకటించిన విషయం విదితమే. అదేవిధంగా ట్రేడ్‌లైసెన్స్‌ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించినట్లు కమిషనర్‌ తెలిపారు. నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్నందుకు గతంలోనే జీహెచ్‌ఎంసీకి 2017 స్కోచ్‌ మెరిట్‌ అవార్డు ప్రకటించింది. దేశంలోని ఇతర నగరాల్లో ఆన్‌లైన్‌ ద్వారా భవన నిర్మాణ అనుమతుల విధానం అమలుకు దాదాపు రెండేళ్ల సమయం పట్టగా జీహెచ్‌ఎంసీలో మాత్రం కేవలం మూడు నెలల్లోనే పూర్తిస్థాయిలో అమలు చేశారు. పుణె కార్పొరేషన్‌లో భవన నిర్మాణ అనుమతులను ఆన్‌లైన్‌తో పాటు మ్యాన్‌వల్‌ నిబంధనలోనూ జారీ చేస్తుండగా జీహెచ్‌ఎంసీలో మాత్రం 100శాతం ఆన్‌లైన్‌ ద్వారా డిజిటల్‌ సంతకంతో కూడిన అనుమతులు జారీ చేస్తున్నారు. ఆన్‌లైన్‌ విధానం వల్ల టౌన్‌ప్లానింగ్‌ అధికారుల్లో జవాబుదారితనంతో పాటు పారదర్శకత ఏర్పడింది. భవన నిర్మాణ అనుమతులు, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ల జారీని ఆన్‌లైన్‌ ద్వారా అందజేయడం ద్వారా జవాబుదారితనం పారదర్శతను సాధించింది. నగరంలో మొత్తం రెండువేల ఆటోలు చెత్తను సేకరిస్తుండగా వీటిలో రాజేంద్రనగర్‌, ముషీరాబాద్‌, మల్కాజ్‌గిరి తదితర సర్కిళ్లలో 90శాతానికిపైగా స్వచ్ఛ ఆటోలద్వారా తడి, పొడి చెత్తను వేరువేరుగా చేసి ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు పంపిస్తున్నారు. రాజేంద్ర నగర్‌ సర్కిల్‌లో అత్యధికంగా 98.27 శాతం చెత్తను వేరువేరుచేసి తరలిస్తుండగా, హయత్‌నగర్‌, సరూర్‌ నగర్‌, మెహిదీపట్నం సర్కిళ్లలో అతితక్కువ మొత్తంలో చెత్తను వేరువేరుగా చేస్తున్నారు. వీటితోపాటు ప్రతి ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ వద్ద తడి, పొడి చెత్తను వేరువేరుగా తెచ్చే వాహనాల సంఖ్యను పేర్కొనే బోర్డు, ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌లో తడి, పొడి చెత్తను వేరువేరుగా చేసే ప్రాంతాలవద్ద బోర్డులను విధిగా ప్రదర్శించాలని స్పష్టంచేశారు. చెత్తలో 75శాతం తిరిగి ఉపయోగ పడుతుందన్న అంశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి స్వచ్ఛ ఆటో పూర్తిస్థాయిలో పనిచేసే అంశంపై సవిూక్షించాలని సుదీర్ఘకాలంగా ఆటోలు నడపని డ్రైవర్లనుంచి ఆటోలను స్వాధీనపర్చుకోవాలని కమిషనర్‌ తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరంలో చెత్త తరలింపునకు ప్రవేశపెట్టిన రెండువేల ఆటోటిప్పర్ల ద్వారా నూరు శాతం తడి, పొడి చెత్తగా వేరుచేసి ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు తరలించే పక్రియపై జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేరుచేసి స్వచ్ఛ ఆటోలకు అందించడానికి 44లక్షల డస్ట్‌బిన్‌లను పంపిణీచేశారు. అయిన ప్పటికీ ఇంటివద్దే తడి, పొడి చెత్తను వేరుచేయకుండా కలిపి స్వచ్ఛ ఆటోలకు ఇస్తున్నారు. దీంతో ఆటోస్థాయిలోనే చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి తరలించాలని ఆటో డ్రైవర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో చెత్త ద్వారా వచ్చే ప్లాస్టిక్‌, ఇనుము తదితర లోహాలను వేరుచేసి విక్రయించడం ద్వారా స్వచ్ఛ ఆటో డ్రైవర్లు అదనపు ఆదాయం పొందుతున్నారు. వీటితోపాటు ఆటోలలో ఏర్పాటుచేసిన పార్టీషన్లలో తడి చెత్తను, పొడిచెత్తను వేరువేరుగా సేకరించి తరలిస్తున్నారు.