Thursday, 5 November 2026

బషీరాబాద్ మండలంలో అట్టహాసంగా ప్రారంభమైన పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమం

బషీరాబాద్ మండలంలో అట్టహాసంగా ప్రారంభమైన పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమం..
మైల్వార్ తాండ, మైల్వార్ గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు డిసెంబర్ 5(జనంసాక్షి)తన సొంత మండలమైన బషీరాబాద్ మండలం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ సైడ్ డ్రెయిన్లు, సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి సహకారంతో తాండూరు కు అధిక నిధులు మంజూరు అయాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించాకా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందుతున్నాయని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు లాంటి పథకాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.మహిళల కు ప్రధాన ప్రాధాన్యం ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్, ఒంటరి మహిళా పించన్, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో ఆడపడుచుల కు అండగా నిలుస్తున్నారని చెప్పారు. తాండూరుకు ప్రత్యేక నిధులు తాండూరు అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు రాము నాయక్, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, నాయకులు నర్సిరెడ్డి, గోపాల్ రెడ్డి, సికిందర్ ఖాన్, శివరాం నాయక్, పాండురంగ రెడ్డి, రుక్మా రెడ్డి, వెంకటయ్య, ముకుంద్, నరేష్ చవాన్, హన్మంత్ రెడ్డి, సర్పంచులు లాలూ, సూర్య నాయక్, దేవ్ సింగ్, నర్శి రెడ్డి, ఎంపిటిసిలు లక్ష్మి బాయి, రాజు పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు