Wednesday, 4 November 2026

బస్తి దవాఖాన ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్న చైర్మన్లు,కంటోన్మెంట్ ఇంచార్జ్, మాజీ బోర్డు సభ్యుడు పాండు యాదవ్

 

 

 

 

 

 

కంటోన్మెంట్ జనం సాక్షి మే 22 కంటోన్మెంట్ నియోజకవర్గం నందమూరి నగర్ లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను కంటోన్మెంట్ బోర్డు ఆరోవ వార్డ్ మాజీ సభ్యడు విద్యావతి పాండు యాదవ్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,తెలంగాణ మెడికల్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గాఎర్రోళ్ల శ్రీనివాస్‌,తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మెన్ గజ్జెలనగేష్,తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే క్రిశాంక్,కంటోన్మెంట్ నియోజకవర్గం ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్య నందిత,నివేదిత, శ్రీ గణేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసినందమూరి నగర్ బస్తి దవాఖాన ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూగతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అంటేనే ప్రజలు భయపడేవారని అన్నారు.తమ ప్రభుత్వం కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగాసకల వసతులు,సదుపాయాలను ఈ బస్తీ దవాఖానాలో మెరుగైన సౌకర్యాలతో కూడిన వైద్యాన్ని అందించేందుకు వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.మరిన్ని ఆసుపత్రులను కూడా అందుబాటులోకి తీసుకురావల్సిన అవశ్యకత ఉందన్నారు.కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడిగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాళ్లు ఇప్పటికీ చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్ లో రాజకీయంగా బిఆర్ఎస్ పటిష్టంగాఉందని వచ్చే ఎన్నికలలో కూడా గెలిచి సీటు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ బస్తీ దవాఖానాలో ఒక డాక్టరు,ఒక స్టాఫ్‌ నర్స్‌, ఒక నర్స్‌తోపాటు మందులు,రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలోబస్తీ దవఖాన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీలక్ష్మి ,బోయిన్ పల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ లింగారెడ్డి, స్టాఫ్ నర్స్ ఎం.సంగీత,సహాయక సిబ్బంది ఏఎన్‌ఎం సునీత,యాషెస్ మరియుబీఆర్ఎస్ పార్టీ నాయకులూ ప్రభుగుప్త,ముప్పిడి మధుకర్, ప్రవీణ్ యాదవ్,సంజీవ్,నరహరి,బాలరెడ్డి, జయరాం,కృష్ణ, మల్లెల విశ్వనాథ్,ప్రభాకర్ రెడ్డి,శ్యామ్ గౌడ్ తదితరులు పాల్గున్నారు.