Wednesday, 4 November 2026

భాగ్యరెడ్డి వర్మ గొప్ప సంఘసంస్కర్త. ఎస్పీ అఖిల్ మహాజన్.

 

 

 

 

 

 

 

 

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. మే 21. (జనంసాక్షి). భాగ్య రెడ్డి వర్మ గొప్ప సంఘసంస్కర్త అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ స్వతంత్రానికి ముందు దళితుల హక్కుల కోసం సమానత్వం కోసం భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని అన్నారు. హైదరాబాద్ సంస్థానంలో దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వేలాదిమంది విద్యార్థులకు విద్య అందేలా చూసారని తెలిపారు కార్యక్రమంలో డిఎస్పి రవికుమార్, అడ్మినిస్ట్రేషన్ అధికారి అహ్మదుల్లా ఖాన్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.