.మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 12బస్తి దవాఖానలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.బుధవారం నేరెడ్ మెట్ మెట్ డివిజన్ పరిధిలోని మధుర నగర్ లో స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి తో కలిసి బస్తి దావఖానను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నిరుపేదలకు ఇంటి దగ్గరనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవఖాన లను ఏర్పాటు చేసిందని బస్తీ దవాఖాన లో 57 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్,స్టాఫ్ నర్స్,ఒక నర్సు అందుబాటులో ఉంటూ రోగ నిర్ధారణ పరీక్షల అనంతరం మందులు ఉచితంగా అందజేస్తారని తెలిపారు.అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పిహెచ్ సి డాక్టర్ కపూర్, డిప్యూటీ కమిషనర్ రాజు,బస్తీ దవాఖాన వైద్యాధికారి వెంకటేష్,ఎన్ఎస్ఎస్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు ఉపేందర్ రెడ్డి, చెన్నారెడ్డి, శివ కుమార్ గౌడ్, శ్రీనివాస రెడ్డి, రాజు,రాజేష్ గౌడ్,సాయి నరేష్, యాది,శోభ,రమాదేవి,విజయలక్ష్మి, పరిమళ,ప్రమీల,మహేష్ తదితరులు పాల్గొన్నారు.




