మహా ముత్తారం ఏప్రిల్ 12 (జనంసాక్షి)మండల వివో ఏ అధ్యక్షుడు జాడి వెంకటయ్య ఆధ్వర్యంలో సమ్మె నోటీసులను ఈ సమ్మె నోటీసును స్థానిక ఐకెపి ఎపిఎం మరియు మండల డిప్యూటీ తాసిల్దార్,మండల పరిషత్ అభివృద్ధి అధికారి లకు సమ్మె నోటీసులు అందరం కలిసి సంబంధిత అధికారులకు అందజేయడం బుధవారం అందజేశారు.ఈ అందించిన నోటీసు లోతెలంగాణ ఐజేపిఈఓఏల ఐకెపి వివో ఏ లను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రతను కల్పించాలి, కనీస వేతనం 26వేలను ఇవ్వాలి 10 లక్షల సాధారణ ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలి, సర్ఫు నుండి ఐడి కార్డులను ఇవ్వాలి, అర్హులైన వివో ఏ లను సీసీలుగా ప్రమోషన్స్ కల్పించాలి, ఈ డిమాండ్లతో సమ్మె నోటీసు లో పేర్కొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ లో 17 606,మంది వివో ఎల్ గా గ్రామ సంఘాల సహాయకులుగా పనిచేస్తున్న గత 19 సంవత్సరాల నుంచి గ్రామంలో మహిళల అభ్యున్నతికి మహిళా స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటుచేసి ఎంతగానో దీర్ఘకాలికగా పనిచేస్తున్న తగిన ప్రతిఫలం లేక నాన్న ఇబ్బందులతో చాలీచాలని జీతంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి సిద్ధ శుద్ధి లేకుండా ఉంటుందని మా డిమాండ్ కోసం మేము సమ్మె చేయడం జరుగుతుందని మండల అధ్యక్షులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వివో ఏ సంఘం నాయకులు చకినాల మల్లయ్య, తోట్ల రాజేష్, గోస్కుల సత్యం, మేడ మల్లేష్, మడావత్ రాజన్న, మీర్జా నజ్మా బేగం, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.




