బీఆర్‌ఎస్ పార్టీకి బలం, బలగం ప్రజలు కార్యకర్తలేనని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు.ఈ రోజు కొడంగల్ పట్టణ కేంద్రంలో బొంరస్ పేట మండల కార్యకర్తల, ప్రజాప్రతినిధుల బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు
ప్రతిపక్షాల ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి రాష్ట్రంలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం
తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే – ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
కొడంగల్ పట్టణ కేంద్రంలోని మురారి ఫంక్షన్ హాల్లో బొంరస్ పేట్ బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం
అనంతరం ఖమ్మం జిల్లాలో నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో జరిగిన అపశృతి లో ఇద్దరు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరణించడం పట్ల ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరియు మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలు రెండు నిమిషాలపాటు మౌనం పాటించడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు




